ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ నేతృత్వంలో 14 మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతల బృందం గురువారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ...
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ నేతృత్వంలో 14 మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతల బృందం గురువారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. వీరిలో నటులు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్, సిద్ధార్థ్ మల్హోత్రా, నటీమణులు ఆలియాభట్, భూమి పెడ్నేకర్, డైరెక్టర్లు అశ్వినీ అయ్యర్, రోహిత్ శెట్టి, నిర్మాతలు ఏక్తా కపూర్, మహవీర్ జైన్ ఉన్నారు.
ఈ సందర్భంగా జాతి నిర్మాణంలో బాలీవుడ్ పాత్రపై వారు చర్చించారు. అలాగే వినోదాన్ని విద్యలో ఎలా భాగస్వామ్యం చేయాలన్న విషయం కూడా చర్చకు వచ్చింది. అనంతరం కరణ్ జోహర్ ప్రధాని మోదీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీతో సమావేశం కావడం అద్భుతమైన అవకాశమని ఫొటో కింద క్యాప్షన్ రాశారు.
సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీని తగ్గించినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. బాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల పలువురు నిర్మాతలు కూడా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారు చేసిన అభ్యర్థన మేరకు సినిమా టికెట్లపై జిఎస్‌టిని తగ్గించారు. గత సమావేశంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నేటి సమావేశంలో మహిళా తారలు కూడా ఉండేలా జాగ్రత్తపడినట్లు కనపడుతోంది.
No comments